calender_icon.png 18 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం

18-12-2025 12:54:31 AM

  1. తెలంగాణ ప్రజలు దీనిని సమర్దించరు
  2. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధమైనదని, స్పీకర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తీర్పును ఇప్పించిందని బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి చేరలేదని చెప్పడం దుర్మార్గమన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

తెలంగాణ ప్రజలు దీనిని సమర్ధించరని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అవమానించిందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్, గతంలో బీఆర్‌ఎస్ ప్రోత్సహిచి అనైతిక పద్ధతులను పాల్పడ్డాయన్నారు. గతంలో బీఆర్‌ఎస్ కూడా ఇదే విధమైన విధానాలను అవలంభించి ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన విమర్శించారు.