23 March, 2026 | 5:22 AM

బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం

23-03-2026 12:12 AM

రాష్ట్ర బడ్జెట్‌ఫై  బీఆర్‌ఎస్ నాయకుల  ఫైర్

మణుగూరు, మార్చి 22 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేసేలా బడ్జెట్  రూపొందించిందని, బడ్జెట్లో కేటాయింపులో  ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేసిందని మండల బీఆర్‌ఎస్ నాయకులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టమాల్లారం లోని పార్టీ కార్యాలయం ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ ఎస్టీ సెల్  జిల్లా నాయకులు వట్టం రాంబాబు, మండల ఎస్టీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు సకిని బాబురావు, వేర్పుల సురేష్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తాజా బడ్జ్పె  తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడంలో బడ్జెట్ల హ్యాట్రిక్ కొట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మరోసారి రూపాయ కూడా ఇవ్వకుండా కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మళ్లీ మట్టి కొట్టారన్నారు. మహిళలను మళ్లీ వంచించారని, తులం బంగారం లేదని, రూ. 2500 లు రావన్నారు.

ఈసారి కూడా రూ.4 వేల పెన్షన్ పెంపు ఊసే లేదన్నారు. నిరుద్యోగులున్నారనే సోయే ఈ ప్రభుత్వానికి లేదని, బడ్జెట్లో నిరుద్యోగ భ్రుతి అంశమే లేదన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసాకార్డు కదా.. రూపాయి బిళ్ల కేటాయించలేదన్నారు. 6 గ్యారంటీలకు ఈ బడ్జెట్తో పాడె కట్టారని, 56 శాతం బీసీ జనాభాకు 4 శాతం కేటాయించి ఎస్సీ, ఎస్టీలకు సైతం బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేశారన్నారు..

రూ.లక్షల కోట్ల పెట్టబడులు తెచ్చామని ఆర్థిక మంత్రి చెప్పడం సిగ్గు చేటన్నారు.  బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ చేసిన అప్పు ల భాగోతంపై విచారణ చేపడతామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో  ఎస్టీ సెల్ కార్యదర్శి బూర్గుల సంజీవ రా వు, ఎస్సీ సెల్ నాయకులు గుంటక ఏశా వు,వావిలాల నరసన్న, మండారి సతీష్, సుభారి వెంకన్న,పొడుతూరి విక్రం, జగదీష్, శంకర్, వంశీ, శశికుమార్ పాల్గొన్నారు.