23 March, 2026 | 3:32 AM

కూలిందన్న కాళేశ్వరంతోనే సాగైన ఆయిల్ పామ్

23-03-2026 12:11 AM

కేసీఆర్ నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి రేవంత్ ప్రారంభోత్సవాలా

విలేకరుల సమావేశంలో బిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి 

గజ్వేల్, మార్చి 22: కేసీఆర్ సహకారం, హరీష్ రావు కృషి వల్లే నర్మెట్టలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యిందని బిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. గజ్వేల్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాలేశ్వరం మల్లన్న సాగ ర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మ సా గర్ లేకుంటే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ లేదన్నారు. కూలిపోయిందన్న కాలేశ్వరం ప్రాజె క్టు వల్లనే  విస్తుతంగా ఆయిల్ ఫామ్ సాగుతోపాటు పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ లకు మాత్రమే పరిమితమాయ్యారన్నారు.

నర్మెటలో 62 ఎకరాలలో దాదాపు రూ.300 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించార న్నారు. కేంద్రం ప్రభుత్వం పామాయిల్ తోటలకు ఆమోదయోగ్యం కాదని గతంలో వెల్లడించారని, కాలేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, ప్రాజెక్టులతో పామాయిల్ పంటల సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ ది అన్నారు. కాలేశ్వరం కూలిపోయిందన్న రేవంత్ రెడ్డి పామ్ ఆయిల్ సాగు, ఫ్యాక్టరీ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో 5 దఫాలకు గాను రైతుబంధు కేవలం 3 దఫాలకు మాత్రమే ఇవ్వడం చాలా దారుణం అన్నారు, ఈరోజుకి కూడా రైతులకు రైతుబంధు ఇవ్వలేదని తెలిపారు, రైతులందరికీ ప్రతి ఎకరానికి రూ.15వేల రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ రైతు బంధును కూడా వెంటనే రైతుల ఖాతాల లో పూర్తిస్థాయిలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో పెండింగ్ పనులు కోసం గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు రూ.180 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో నిర్మాణం కానీ పనులకు కూడా నిధులు ఇవ్వకుండా రిబ్బన్లు కట్ చేయడం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 

ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, ఏ ఎంసి మాజీ చైర్మన్ మా దాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, నాయకు లు నూనె కుమార్ యాద వ్, కౌన్సిలర్లు శ్రీనివాస్, కోట బాబు, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు దుర్గాప్రసాద్, మెట్టయ్య, రాజు, రహీం, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, అజీజ్ బాలకిషన్, అహ్మద్, ఉమర్, హనుమంత్ రెడ్డి, శివ తదితరులున్నారు.