13-08-2025 12:00:00 AM
దేవరకొండ, ఆగస్టు 12 : చందంపేట మండలంలోని రేకులగడ్డ రోడ్డు నుండి నల్లచెలముల గ్రామం వరకు 1.60 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని,మరోవైపు గ్రామ గ్రామాన ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు.
తమ సేవలను గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.అనంతరం చందంపేట మండలంలోని పెద్దముల గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.