గ్రామ సమస్యలు పరిష్కరించాలి
22-04-2026 12:00 AM
తాడ్వాయి, ఏప్రిల్, 21 (విజయక్రాంతి): గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావును మంగళవారం సంగోజి వాడి గ్రామస్తులు కలిశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేను కలిసి గ్రామ సమస్యలు వివరించారు.
సమస్యలు ఒక్కొక్కటి గా పరిష్కరించాలని వేడుకున్నారు. గ్రామానికి మహిళా సంఘం కోసం రూ.10 లక్షలు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గైని శివాజీ,వాడికారి మురళి,గంట బాలరాజు, పారుక్,హమీద్, కరామత్ తదితరులు ఉన్నారు






