calender_icon.png 31 December, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

31-12-2025 12:22:51 AM

బిచ్కుంద, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): కామారెడ్డి  జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ...ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల లబ్ధిదారులంరికీ ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. వెంటనే నిర్మాణ ప్రారంభించి తొందరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతి పేదవాడి స్వంత ఇంటి కల నెరవేరుతుందన్నారు.

ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి లో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యోగేష్ సేట్, దర్పల్ సంతోష్, సాయిని బస్వరాజ్, చింతల్ హన్మండ్లు, ఖలీల్, ఉత్తం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.