31-12-2025 12:23:59 AM
రాష్ట్ర కార్యదర్శిగా లోపల్లి శ్రీనివాసరావు..
కామారెడ్డి , డిసెంబర్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా లోపల్లి శ్రీనివాసరావును రాష్ట్ర సర్పంచ్ల సంఘం మంగళవారం నియమించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామానికి చెందిన సర్పంచ్ విజయం సాధించారు.
ఆయన రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శిగా నియమించడంతో సర్పంచ్ల ఫోరంకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో ఎన్నికైన సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన సర్పంచుల పోరం నుండి తన సేవలను అందించి అందరికి అందుబాటులో ఉంటారని అన్నారు.