24-10-2025 05:56:01 PM
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకంలో ఎంపికైన లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఎగుడ రాయమల్లు కోరారు. మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు గోళం సరిత ముత్యాల వెంకట రాజమల్లులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా శుక్రవారం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఒక నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటు పడుతుందని కొనియాడారు. లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.