calender_icon.png 24 October, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ నియంత్రికకు తగిలి గేదె మృతి

24-10-2025 08:21:59 PM

నిర్మల్  రూరల్:  నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్పేట్ శివారులో గల పంట చేనులో మేతకు వెళ్లిన గేదె విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదుముల్ల నారాయణ కు చెందిన గేదె ప్రతిరోజు లాగే మేతకు వెళ్ళింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కంచె లేకపోవడంతో అటుగా వెళ్లిన గేదె తగిలి మృతి చెందినట్లు రైతు వాపోయాడు. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన గేదె లక్ష రూపాయల విలువ ఉంటుందని, ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.