calender_icon.png 24 October, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురక్ష బీమా యోజన చేసుకోవటం వల్ల తమ కుటుంబానికి ఆర్ధిక భరోసా

24-10-2025 08:03:51 PM

లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్

వనపర్తి,(విజయక్రాంతి): ప్రజలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన మరియు సురక్ష బీమా యోజన చేసుకోవటం వల్ల తమ కుటుంబానికి ఆర్ధిక భరోసాను ఇచ్చినవారు అవుతారని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్  సూచించారు. జన సురక్ష 2025 కార్యక్రమం లో భాగంగ  జూలై 1 నుండి అక్టోబర్ 31 వరకు లీడ్ బ్యాంకు కార్యాలయము బ్యాంకు బ్రాంచీల యొక్క సహకారముతో జిల్లాలో జన సురక్ష శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. 

శుక్రవారం లీడ్ బ్యాంక్ కార్యాలయం, వనపర్తి జిల్లా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రేవల్లి శాఖ ఆధ్వర్యంలో ఉదయం రేవల్లి మండలంలోని గౌరీదేవి పల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ మాట్లడుతూ... 18 ఏండ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ కేవలము 456/- (పీఎంజేజేబి వై:436/-& పీఏంఎస్బీ వై :20/-)లతో ఈ రెండు బీమా సౌకర్యాలను పొంది మీ యొక్క కుంటుంబానికి ఆర్ధిక భద్రతను ఆర్ధిక భరోసా కల్పించిన వారిమీ అవుతాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క కే వై సి  ని బ్యాంకు వారికి సమర్పించి మీ ఖాతాలను పునరుద్ధరించుకోవాలన్నారు.

జన సురక్ష కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బంది, యూనియన్ బ్యాంకు రేవల్లి బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బంది , పంచాయతి కార్యదర్శి,బిజినెస్ కరస్పాండెంట్లు, సీఎఫ్ ల్, ఎఫ్ ఎల్ సి కౌన్సిలర్లు, ఏపీఎం బ్యాంకు లింకేజీ, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.