24-10-2025 07:54:19 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో ఇటీవల మరణించిన రాచమళ్ల సత్తయ్య, దేవరాయ సుజాత, బోదాసు నర్సింహా కుటుంబ సభ్యులకు పైళ్ల రమణమ్మ- సత్యనారాయణ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా పైళ్ళ వెంకట్ రెడ్డి-శామిని దంపతులు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైళ్ళ రాజవర్ధన్ రెడ్డి, ఈతాప రాములు, వరకాంతం రాజేందర్ రెడ్డి, మారోజు పాండు రంగయ్య, పైళ్ల కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.