calender_icon.png 24 October, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

24-10-2025 08:28:44 PM

టోల్ గేట్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్ 

మందమర్రి,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని టోల్ గేట్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్ కోరారు. శుక్రవారం పట్టణం లోని కేకే 2 టోల్ గేట్ ఆవరణ లో వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రహదారి ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వల్ల అత్యధికంగా ప్రాణనష్టం సంభవిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. హెల్మెట్ ధరించడం వల్ల దురదృష్ట వశాత్తు ప్రమాదాలు జరిగితే తలకు ఎలాంటి గాయాలు కాకుండా, స్వల్ప గాయాలతో బయటపడవచ్చన్నారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రయాణాలు సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.