24-10-2025 07:50:02 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 59 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేదింటి ఆడపడుచులకు ఎంతో సహాయపడుతుందని ఆయన అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ రైతులకు రైతు భరోసా వంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించడం జరిగిందని అన్నారు.