calender_icon.png 24 October, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైభీమ్ యూత్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

24-10-2025 08:18:16 PM

నూతనకల్,(విజయక్రాంతి): మండల కేంద్రం లోని ​మిర్యాల గ్రామంలో శుక్రవారం జైభీమ్ యూత్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా ఇరుగు వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ఇరుగు నగేష్, ఉపాధ్యక్షులుగా కొమ్ము వెంకటేష్, గౌరవ సలహాదారులుగా మహంకాళి శ్రవణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.​ ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఇరుగు వెంకటేష్ మాట్లాడుతూ... తమ కమిటీ గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తమ వంతు సహాయం అందించడంలో ముందుంటుందని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా నిరుపేదలకు, వృద్ధులకు సహాయపడటం, విద్యా కార్యక్రమాలకు చేయూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలను మున్ముందు చేపట్టనున్నట్లు యూత్ సభ్యుల సమక్షంలో తెలిపారు.ఈ ​కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో పాటు,యూత్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు యూత్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. యువతరం ఉత్సాహంతో గ్రామాభివృద్ధికి తోడ్పడాలని వారు ఆకాంక్షించారు.