24-10-2025 07:45:42 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని టేకులసోమారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ చంద్రముగా పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు రోజు వస్తున్నారా లేదా అని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పదవ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు.
గత సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఎంత అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కూడా ఇప్పటినుండే వార్షిక పరీక్షల కోసం సన్నద్ధం కావాలని, అత్యధిక మార్కులు వస్తే బాసర ట్రిపుల్ ఐటి లాంటి పెద్ద ఇనిస్టిట్యూట్లో సీటు వస్తుందని, దీంతో భవిష్యత్ బాగుంటుందని భవిష్యత్తులో స్థిరపడతారని అన్నారు. గత సంవత్సరం మాధురి ఈ విద్యా సంవత్సరంలో కూడా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు సైకిల్ బహుమతిగా ఇస్తానని విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం చేస్తామని అన్నారు.