24-10-2025 07:58:05 PM
తొగుటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
దౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండల కేంద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధరను అందిస్తోందని తెలిపారు. రైతులు తమ కష్టపడి పండించిన పంటను మధ్యవర్తుల ద్వారా విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచించారు.రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని హెచ్చరించిన ఆయన, పంట కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.