15-11-2025 12:00:00 AM
జవహర్ నగర్ నవంబర్ 14 (విజయ క్రాంతి) : సమతుల్య ఆహారాన్ని తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి అని తీపి పదార్థాలు తగ్గించి జీవనశైలి వ్యాధులను నివారించాలని తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించాలని కోరుతూ ఆర్కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రాం ని నిర్వహించారు.
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్కిడ్స్ స్కూల్ సౌజన్యంతో మహంకాళి అమ్మ వారి కమాన్ నుండి బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్కూల్ విద్యార్థులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చక్కర వినియోగం తగ్గించుకొని జీవనశైలి వ్యాధులు రాకుండా చూసుకోవాలని ఆహారంలో మితస్థాయిలోనే చెక్కర ఉపయోగించాలని అతిఅనర్థ హేతువని నేటి ప్రపంచంలో చాలామంది పిల్లలు చిన్న వయసులోనే మధుమేహం, గుండె జబ్బులు, బీపీ తదితర వ్యాధులకు ల లోను అవుతున్నారని, ఊబకాయం అధిక రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులు ఒకప్పుడు తక్కువ కనిపించేవని కానీ నేడు ఈ వ్యాధులు విపరీతంగా ప్రభలుతున్నాయన్నారు, వీటి నివారణకు ఆహారపు అలవాట్లను జీవనశైలిని వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులతో నమూనా చార్టులు, స్కిట్లు ,వీడియోలు, తదితర కార్యక్రమాలను ప్రదర్శన రూపంలో చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థులేకాక వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.