13-09-2025 07:35:58 PM
మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రంలో గ్రూప్-2 అభ్యర్థులు..
మంథని (విజయక్రాంతి): గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించి ఆరు నెలలు కావస్తున్నాయని, వెంటనే సర్వీసెస్ నీ కేటాయించి అపాయింట్మెంట్ పత్రాలు అందజేయాలని గ్రూప్ 2 సాధించిన అభ్యర్థులు రాష్ట్ర యువజన నాయకుడు గోమాస సచిన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)ను కలిసి వారి సమస్యలు వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు అతి త్వరలో ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుని వారి చేతుల మీదుగా అందిస్తామని హామీ ఇచ్చారని గ్రూప్ 2 అభ్యర్థులు తెలిపారు. అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.