12 May, 2026 | 1:07 AM

గ్రూప్స్ పోస్టులు పెంచాలి

24-04-2024 02:00 AM

l సీఎస్‌కు ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు, టీచర్ పోస్టులు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రూప్ కింద 563 పోస్టులు ప్రకటించారని, కానీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పోస్టులు సరిగ్గా లెక్కిస్తే 1,600 వరకు ఉన్నాయని తెలిపారు. గ్రూప్ పోస్టులు 2,200, గ్రూప్ పోస్టులు 3 వేలు, గ్రూప్ పోస్టులు 25 వేలు, టీచర్ పోస్టులు 25 వేల వరకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.