01-10-2025 01:40:22 AM
కోరేం స్వగ్రామంలో సన్మానించిన మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు
బోయినపల్లి : సెప్టెంబర్ 30 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన డబ్బు సుమన్ ను స్వగ్రామం కోరేం లో మాజీ ఎమ్మెల్సీ చిన్నడి సుధాకర్ రావు పూలమాలవేసి శాలువా కప్పి ఘనంగా సన్మానిం చారు. బోయినపల్లి మండలం కోరేం గ్రా మానికి చెందిన డబ్బు సుమన్ గత గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫె సర్ గా పని చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పదోన్నతి పొందడమే కాక విద్యార్థులకు ప్లేస్మెంట్ అధికారిగా కూడా పదోన్నతి పొందారు. ఈ తరుణంలో మంగళవారం కోరేం స్వగ్రామానికి ఆయన రాగ చెన్నాడి నివాసంలో పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు నిర్వహించిన సమా వేశంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నాడు సుధాకర్ రావు మాట్లాడుతూ అత్యంత నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి చదువుకుని అంచ లంచలుగా పదోన్నతి పొందడం కోరం గ్రా మానికి గర్వకారణమని చెప్పారు. గ్రామ యువకులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చదువుకోవాలని కోరారు. విలువైన సమయాన్ని ఎవరు వృధా చేయవద్దని చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయనను తోటి స్నేహితులు గ్రామ యువకులు మాజీ ప్రజాప్రతిని ధులు ప్రశంసించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్ చెన్నా డి మదన్ మోహన్ రావు, సింగిల్ చైర్మన్ కిషన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ డబ్బు మమత, సింగల్ విండో డైరెక్టర్లు డబ్బు రాద వెంకటరెడ్డి, స్వామి రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు ఎర్రగడ్డం రాజశేఖర్ రెడ్డి, మత్స్య కార్మిక సంఘం నాయకులులు న్నారు.
చెన్నాడి సేవలు అభినందనీయం
ఈ సన్మానం అనంతరం గ్రామస్తులు రైతులు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ చిన్నాడి సుధాకరరావును సన్మా నం నుంచి ఆయన సేవను కొనియాడారు. మామూలు రైతు కుటుంబం నుంచి రాష్ట్రంలోని క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా ఎదిగి కోరేం స్వగ్రామానికి ఆయన చేస్తున్న సేవలు వెల కట్ట లేని వని కొనియాడారు. చెన్నాడి కు టుంబం గ్రామానికి చక్కని ప్రాథమిక పాఠశాల అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా నిర్మాణం చేసి ఇచ్చిందని చెప్పారు.
అదేవిధంగా సబ్ స్టేషన్ కు రైతు వేదిక ప్రధాన రహదారి పక్కన భూదానం చేసిన గొప్ప మనసులని చెప్పారు. అంతేకాక రజక సంఘం అన్ని సామాజిక వర్గాలకు సామాజిక భవనాలు ఆలయాల అభివృద్ధికి చే యూతనిచ్చి అభివృద్ధి చేసినారని చెప్పారు. కోరేం గ్రామం గ్రామం గ్రామస్తులు చెన్నాడి కుటుంబానికి రుణపడి ఉంటామని చెప్పారు.