2 July, 2026 | 5:32 AM

పాఠశాల తనిఖీల మార్గదర్శకాలు జారీ

22-06-2025 12:00 AM

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు కోసం పాఠశాలల తనిఖీల మార్గదర్శకాలను శనివారం విద్యాశాఖ విడుదల చేసింది. పాఠశాలల్లో అకస్మిక తనిఖీలు, పాఠ్యాంశాలు, ప్రణాళికలు అమలు, ఇతర అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలు చేపట్టి నివేదికలను రూపొందించాలని, ఈ తనిఖీలను జిల్లా కలెక్టర్లు, డీఈవోలు పర్యవేక్షించాలని సూచించారు.