28 April, 2026 | 8:36 PM

కరాటే విన్యాసం.. గిన్నిస్ పుస్తకంలో ప్రతిభ

28-04-2026 06:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 26, 2026న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా నుండి చిరంజీవి మాస్టర్ శిక్షణలో హర్షిత్, తన్వి శ్రేష్ట, శ్రీహాస్ కృపాల్, శైలజ, మణితేజ, శేషాంత్, ప్రశాంత్ పాల్గొన్నారు. అలాగే వంశీ మాస్టర్ శిక్షణలో చరణ్ తేజ్, హాస్య, గాయత్రి, భువనేశ్వరి, ఆదిత్య కృష్ణ, జోయా, జోహా పాల్గొన్నారు. విద్యార్థులు సమిష్టిగా కరాటే విన్యాసాలు ప్రదర్శించి గిన్నిస్ బుక్ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటుకున్నారు. నిర్మల్ జిల్లా ప్రాంతం క్రీడా రంగంలో మరో మైలురాయిని చేరుకుంది. స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థులను నిర్మల్ జిల్లా స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ అభినందించింది.