జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం
28-04-2026 06:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని నూతన కలెక్టర్ భవే ష్ మిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మీడియా మిత్రులకు పరిచయమై మాట్లాడారు. నిర్మల్ జిల్లా కు ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు డిపిఆర్ఓ విష్ణువర్ధన్ పాత్రికేయులు ఉన్నారు.






