09-07-2025 03:24:32 PM
కూకట్ పల్లి,(విజయక్రాంతి): కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందు ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కేపిహెచ్బి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కెపిహెచ్బి సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా నందిగట్ల గ్రామానికి చెందిన సీతారాం (43) హెచ్ఎంటిల్స్ శ్రీరాంనగర్ కాలనీలో నివాసము ఉంటూ రోజువారి కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కల్లు తాగే అలవాటు ఉంది.
ఈ క్రమంలోనే హెచ్ఎంటిల్స్ లోని కల్లు కాంపౌండ్ కి వెళ్లి కల్లు తాగి ఇంటికి చేరుకున్నాడు. కల్లు తాగిన రోజు రాత్రి నుంచి వాంతులు, విరోచనాలు రావడంతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఉన్న వైద్యులు అతన్ని పరిశీలించి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కెపిహెచ్బి పోలీసులు కేసు నమోదు చేశారు.