calender_icon.png 9 July, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బుద్ధవనంలో ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవం

09-07-2025 03:44:33 PM

నాగార్జునసాగర్,(విజయక్రాంతి): అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధ వనములో గురువారం ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవ వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. గయాలో సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు  ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ జింకల వనములో ఆషాడ పౌర్ణమి రోజున మొదటిసారిగా తన శిష్యులకు  ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. బౌద్దులు, బౌద్ధ అభిమానులు ఈరోజుని ఎంతో పర్వదినముగా భావించి బుద్ధుని జీవితంలో ముఖ్య ఘట్టాలలో ఒకటిగా ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవం గా జరుపుకుంటారు. బుద్ధవనంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.