09-07-2025 04:00:23 PM
అనంతగిరి: ఇందిరా మహిళా శక్తి పథకం విజయవంతంగా ముందుకు సాగడం అభినందనీయమని వివో ఏ పండగ శైలజ పేర్కొన్నారు మహిళా శక్తి సంబరాల్లో భాగంగా బుధవారం అమీనాబాద్ లో వివో ఏ శైలజ ఆధ్వర్యంలో మహిళ సమైక్య అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పథకాల ద్వారా లబ్ధి పొంది విజయవంతంగా వ్యాపారం చేస్తున్న సీనియర్ మహిళా సంఘాల సభ్యురాలు ఇరుగు భారతమ్మను శాలువాతో సన్మానించారు. అనంతరం శైలజ మాట్లాడుతూ గ్రామ మహిళ సంఘాల సభ్యులు వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఎదగడం హర్షనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం వివిధ పథకాలను ప్రవేశ పెడుతుందని వివరించారు. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు. గ్రామంలో ప్రతి మహిళ పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉండాలని కోరారు. 2024- 25 ఆర్థిక ప్రగతి నివేదిక భవిష్యత్తు ప్రణాళికను వివరించారు వృద్ధులు బాలిక దివ్యాంగ సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.