09-07-2025 03:40:47 PM
సిఐటియు నాయకులు ఎస్. కె బషీర్
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): పెట్టుబడిదారుల మెప్పుకోసం కార్మిక వర్గాలను వారి హక్కులను కేంద్ర ప్రభుత్వం బలి చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్, ఏఐటీయూసీ నాయకులు వల్లెపు నాగార్జునలు ఆరోపించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లో బుధవారం నాడు సిఐటియు,ఏఐటియుసి మరియు ఇతర కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాను ఖండిస్తూ ఎర్రజెండాలతో హిల్ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాల హక్కులను తూట్లు పొడుస్తూ కేంద్రం 4 కోడ్లను అమలు చేయాలని చూస్తుందని వెంటనే కేంద్రం తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.