calender_icon.png 9 July, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నెర్ర చేసిన కార్మిక వర్గం

09-07-2025 03:49:28 PM

నూతనకల్,(విజయక్రాంతి): మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడులను తెస్తూ కార్మిక హక్కులను కాలరాయడానికి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు బుధవారం సమ్మెలో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ, సీఐటియూ, ఏఐకేఎంఎస్, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎర్రజెండాలు చేత పూని దంతాలపల్లి మెయిన్ రోడ్డు పై నిరసన వ్యక్తం చేసి మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై గట్టిగా నినదించారు.

ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.కె.బాబు జానీ మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ , బహుళ జాతి కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్ లు తెచ్చారని ఇవి కార్మిక వర్గానికి ప్రమాదకరంగా మారాయని, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరల కు అనుగుణంగా ప్రతి కార్మికుడి కనీస వేతనం 26వేల రూపాయలకు పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కేజీబీవీ ఆశ అంగన్వాడి, గ్రామపంచాయతీ వర్కర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడన్నీ  విరమించుకోవాలని ఆయన అన్నారు