09-07-2025 03:29:21 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హౌసింగ్ బోర్డ్ కాలనీలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి దరఖాస్తుదారులు బుధవారం పాలాభిషేకం చేశారు. ప్లాట్ల కోసం గతంలో డబ్బులు కట్టిన 90 మందికి న్యాయం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కనగల్ మాజీ జెడ్పిటిసిలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశంలు మాట్లాడుతూ... వినాయక హౌసింగ్ బోర్డ్ కాలనీలో 15 సంవత్సరాల క్రితం ప్లాట్ల కోసం 90 మంది డబ్బులు కట్టిన డ్రాలో రాలేదని తెలిపారు. దీంతో డబ్బులు కట్టిన వారంతా గత 15 సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నారని అన్నారు. ఇటీవల హౌసింగ్ బోర్డు కాలనీలో ప్లాట్ల కోసం అధికారులు డ్రా తీయగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.