‘గల్ఫ్’ ఆశలు ఉఫ్
రాజన్న సిరిసిల్ల, మే26 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ మెట్ట ప్రాంతం కావడం, సరైన నీటి వసతులు లేక పంటలు పండకపోవడం, ఉపాధి దొరక్కపోవడం వంటి కారణాలతో ఇక్కడి యువత గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఓమన్, బెహ్రా న్, కువైట్, ఖతర్ వంటి దేశాలకు వెళ్లేందుకు మక్కువ చూపుతారు. అష్టకష్టాలు పడి రూ. 3లక్షల వరకు పోగు చేసి పాస్‌పోర్ట్, వీసా సంపాదిస్తారు. కొందరు అక్కడి వెళ్లి సెటిల్ అయితే, కొందరు మాత్రం నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతారు. గల్ఫ్ వెళ్లిన తర్వాత చేతిలో ఉన్నది నకిలీ వీసా అని తెలిసి నీరుగారిపోతారు. పోలీసులు నిత్యం నకిలీ ఏజె న్సీలపై దాడులు నిర్వహిస్తున్నా, నిందితులపై కేసులు నమోదు చేస్తున్నా, మోసాలు మాత్రం ఆగడం లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నా యి. ఒక్కో విసాకు దేశాన్ని బట్టి రూ.60 వేల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తీసుకున్న డబ్బులకు ఎలాంటి రశీదులు, పత్రాలు ఇవడం లేదు. దీంతో మోసాలకు గురైన సందర్భాల్లో నిరుద్యోగు లు సొమ్మును రికవరీ చేసుకోలేక పోతున్నారు. కొందరు ఏజంట్లు అభ్యర్థుల పాస్ పోర్టు, వీసా దరఖాస్తుల్లో పుట్టిన తేదీ, నివా స, విద్యార్హత ధ్రువపత్రాలు నకిలీవి సమర్పించి మోసం చేసిన ఘటనలూ అనేకం.
ఫేక్ ఇంటర్వ్యూలు.. ఫేక్ వీసాలు..
డబ్బు కోసం ఆశపడి కొందరు ప్రభు త్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఏజెంట్ల అవతారం ఎత్తుతున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి యువతను ఆకర్షిస్తున్నారు. పెద్ద హోట ళ్లలో మంచి ఉద్యోగం, అక్కడి కరెన్సీ నోట్ల ను ఇక్కడ మార్చుకుంటే రూ.లక్షల్లో జీతం వస్తుందని ఊరిస్తున్నారు. ఫేక్ ఇంటర్వ్యూ లు నిర్వహించి, ఉద్యోగానికి ఎంపికయ్యారని నమ్మబలికి యువత నుంచి రూ.లక్షల్లో డబ్బు గుంజుతున్నారు. వారి మాటలు నమ్మిన యువకులు తీరా గల్ఫ్ వెళ్లి అక్కడ ఏ పనీ దొరక్క, వీసా నకిలీ అని తెలుసుకుని బావురుమంటున్నారు. కొందరు అక్కడి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలువుతున్నారు. మరికొందరు గల్ఫ్‌లోనే తనువులు చాలిస్తున్న ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కానీ ఇక్కడ వారిని నమ్ముకుని ఉన్న కుటుంబాలు మాత్రం తల్లడిల్లు తున్నాయి.
కమీషన్ల కోసం కక్కుర్తి..
గ్రామాల నుంచి గల్ఫ్‌కు వెళ్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన ఏజెంట్లు ట్రావెల్ ఏజెన్సీలతో కుమ్మక్కు అవుతారు. వారిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి యువతకు కంపెనీ వీసా అని చెప్పి, విజిటింగ్ వీసా అంటగడతారు. వీసా తీసుకున్న వారు మాత్రం తమ కు కంపెనీ వీసా వచ్చిందని సంతోషపడతారు. మంచి జీతం వస్తుందని, ఓవర్ టైం చేసి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని సం బురపడతారు. కానీ గల్ఫ్ వెళ్లిన తర్వాతే బాధితులకు తెలస్తుంది తాము ఎంత మోసపోయాయోనని. మరోవైపు కొందరు ఏజెంట్లు పాస్‌పోర్ట్, వీసాల పేరుతో వ్యక్తుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని ఇక మళ్లీ ముఖం చూపడం లేదు. ఇలా గ్రామాల్లో వందలాది మంది వ్యక్తులు పాస్‌పోర్ట్, వీసా ల కోసం ఎదురుచూస్తూనే ఉంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా గ్రామానికి కనీసం ఇద్దరు నకిలీ ఏజెంట్ల అవతారం ఎత్తారు. నిబంధనల ప్రకారం ఏజెన్సీ నిర్వహించాలనుకునే వారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉండేవారికి ఇవేమీ తెలికపోవడంతో ఏజెంట్ల ఉచ్చులో పడుతున్నారు. ఏజెంట్ల కింద మళ్లీ సబ్ ఏజంట్లు పుట్టుకొచ్చి గల్ఫ్ వెళ్లాలనుకునే వారిని దోచుకుంటున్నారు. గల్ఫ్ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మోసాలు వెలుగులోకి వస్తున్నాయ. మోసాలపై గత ఏడాది జిల్లాలో 43 కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 కేసులు నమోదయ్యాయి. తాజాగా రుద్రంగి, తంగళ్లపల్లి, గంభీరావుపేటలో పోలీసులు ముగ్గు రు నకిలీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం మోసాల కు గురి చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయి.
కంపెనీ విసా పేరిట..
విజిట్ విసా..
ఏజెంట్ కంపెనీ విసా అని చెప్పి నాకు దుబాయి విజిటింగ్ విసా ఇచ్చా డు. ఏజెంట్‌ను నిలదీస్తే విసిట్ విసాతోనే దుబాయి పంపించి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని కబుర్లు చెప్పా డు. నేను మూడు నెలలు దుబాయి లో అష్టకష్టాలు పడ్డా. అక్కడ మేం ఒకే గదిలో 18 మంది ఉండేవాళ్లం. నరకయాతన అనుభవించాం. చివరకు కంపెనీ విసా లేక ఇంటికి తిరిగివచ్చాను. నాకు అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 2.5 లక్షల వరకు ఖర్చయ్యాయి. డబ్బు తిరిగి ఇవ్వమని ఏజెంట్‌ను అడిగితే మళ్లీ వీసా ఇప్పిస్తానని చెప్తున్నాడు.
-కె.తిరుపతి రెడ్డి,
గల్ఫ్ బాధితుడు, గోపాల్‌రావుపల్లి
పీడీ యాక్ట్ నమోదుకూ వెనుకాడం..
నకిలీ వీసాలు ఇచ్చి వ్యక్తులను గల్ఫ్ కు పంపుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతాం. అవసరమైతే ఏజెన్సీల లైసెన్సుల రద్దు చేయిస్తాం. నిందితులపై డీడీ యాక్ట్ మోపేందుకు వెనుకాడం. యువత నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపో వద్దు. లైసెన్స్ కలిగిన ఏజెంట్లను ఎంచుకుని మాత్ర మే విదేశాలకు వేళ్లే పనిచేయించుకోవాలి. ఏజెంట్లపై ఎలాంటి అనుమా నాలు వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
-అఖిల్ మహాజన్,
ఎస్పీ, రాజన్న సిరిసిల్ల






