calender_icon.png 21 January, 2026 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురునానక్ సందేశం సదా అనుసరణీయం

15-11-2024 12:35:58 AM

సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : వినయం, సేవాభావంతో జీవితాన్ని గడపాలనే గురునానక్ సందేశం సదా అనుసరణీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, సిక్కు సోదరులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

గురునానక్ ప్రవచించిన ప్రేమ, కరుణ, మానవతా సందేశాలు మనల్ని వెలిగించాలని, సరైన మార్గంలో నడిపించాలని ఆకాంక్షించారు. ప్రజలు సోదరభావం, సామ రస్యంతో మెలగాలని, ఆత్మగౌరవంతో జీవించాలని గురునానక్ సూచించారని కొనియాడారు. గురునానక్ జీవితం, ఆయన బోధనలు మానవాళికి నిరంతరం ప్రేరణ కలిగిస్తాయని తెలిపారు.