10-07-2025 06:41:51 PM
మందమర్రి (విజయక్రాంతి): గురు పౌర్ణమి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్(BJP District President Nagunuri Venkateshwar Goud) హాజరై మాట్లాడారు. గురు పౌర్ణమి సందర్భంగా యోగా, సాంస్కృతిక రంగాల్లో తమ సేవలు అందించిన గురువులను సన్మానించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
అనంతరం యోగా గురువు ముల్కల్ల శంకర్, నృత్య గురువు ఉప్పులేటి నరేష్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, రాష్ట్ర నాయకులు పానుగంటి మధు, పట్టి కృష్ణ, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పోతునూరి రాజేందర్, శనిగారపు శ్రీనివాస్, దుర్గం సత్యంబాబు, సీనియర్ నాయకులు కొంతం రాజు, గాదె రాములు, మారం రంజిత్, ఓం ప్రకాష్, వెంకటరమణ చారి, ఆనంద్ లు పాల్గొన్నారు.