04-12-2025 04:32:24 PM
చేర్యాల: చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కబడ్డీ టీమ్ బుధవారం పీఎం శ్రీ,ఎస్ జిఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి జట్టు మొత్తం ఎంపిక కావడం గర్వకారణం అని ప్రిన్సిపాల్ పోలోజు నరసింహ చారి అన్నారు.హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో చేర్యాల పాఠశాల విద్యార్థుల టీం మొత్తం పాల్గొనబోతున్నదని ఈ సందర్బంగా విద్యార్థులను పిడి సురేష్ పిఈటి రేణుకలను ప్రిన్సిపాల్ పోలోజు నరసింహ చారి ఉపాధ్యాయ బృందం అభినందించారు.