18 April, 2026 | 6:33 AM

బీఆర్‌ఎస్ హయాంలో గురుకులు అస్తవ్యస్తం

14-06-2025 01:29 AM
  1. ఉపాధ్యాయ నియామకాల ఊసేలేదు..

కాంగ్రెస్ వచ్చాకే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలోనే గురుకుల విద్య అస్తవ్యస్తమైందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. గురుకులాల కార్యదర్శిగా ఎనిమిదేళ్ల పాటు పని చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విద్యారంగాన్ని ఏమి ఉద్ధరించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు మార్ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాం లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని, అప్పుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎం దుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 60 వేల  ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, అద్దె భవనాలకు అద్దె చెల్లించామని స్పష్టం చేశారు. అలాగే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెం చినట్లు తెలిపారు. వర్సిటీలకు వీసీల నియామకంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం పాటించారని గుర్తుచేశారు.