calender_icon.png 1 October, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయోమయంలో హస్తం!

01-10-2025 12:00:00 AM

  1. అధికార పార్టీకి రథసారధి కరువు..
  2. ఆందోళనలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు 
  3. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉత్కంఠ 
  4. ఇది కొత్తగూడెం నియోజకవర్గం తీరు 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 30, (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆ పార్టీ కి సరైన రథసారథి లేక కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జిల్లా రాజకీయా ల్లో అసాధారణ ఉత్కంఠ నెలకొంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన సాగుతున్నప్పటికీ, పొత్తులు భాగంగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని మిత్రపక్షమైన సిపి ఐ కి కేటాయించారు.

అదే కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ రథసారథి ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ తికమక పడుతున్నారు. వేదికల పైన పెద్ద నాయకత్వం కనిపిస్తున్న, నియోజకవర్గంలో పార్టీని నడిపించే స్థానిక నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంది వ చ్చిన అవకాశాన్ని సిపిఎ పార్టీ సద్వినియో గం చేసుకుంటూ ఆ పార్టీ సహకారాన్ని పటిష్టంగా వాడుకొంటూ పార్టీ బలాన్ని పెంచుకొంటోంది.

ఈ తరుణంలో కాంగ్రెస్ తీవ్ర ప్రమాదంలోకి నెట్టబడుతున్నట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడు కుంటుందా, మిత్రప క్షం నెపంతో సిపిఐకే ప్రాధాన్యత ఇస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిణామం కాంగ్రెస్ కాడలకు గట్టి దెబ్బ తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చురుగ్గా పర్యటనలు కొనసాగి స్తూ, కొత్తగూడెం నియోజకవర్గాన్నికి స్పష్టమైన దిశా నిర్దేశం కల్పించకపోవడం కార్యక ర్తల ఉత్సాహాన్ని నీరుగారుస్తోంది.

ఇదే భ యంతో భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిట ని కొందరు కార్యకర్తలు బహిరంగంగా చ ర్చించుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగి తే కంచుకోటగా పేరు ఉన్న కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయ్యే పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో నాయకత్వం లేకపోతే రానున్న ఎన్నికల్లో ఫలితాలు తారు మారవుతాయి. నియోజకవర్గాన్ని సిపిఐ కి కేటాయిస్తే కాంగ్రెస్ స్కాలర్ నిరుత్సాహంతో వెనక్కు తగ్గుతుంది.

రేవంత్ నాయకత్వం నియోజకవర్గంలో రాజకీయ భవిష్యత్తుపై అ ధిష్టానం ఏం నిర్ణయిస్తుందో అన్నది ఎప్పు డు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పా ర్టీకి రథసారథి ఎవరు అన్న సమాధానం వ చ్చేవరకు కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొందని చెప్పవచ్చు.