16-10-2025 11:22:51 AM
సెల్‌ఫోన్‌ను కోల్పోయిన మహిళకు అందజేత
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): జన్నారం మండలానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో రద్దీ కారణంగా హడావుడిగా బస్సు దిగిన ఆమె ఫోన్ మర్చిపోయింది.అదే బస్సులో (TS116–0318) కరీంనగర్ నుంచి ఉట్నూర్ వెళ్తున్న పాత్రికేయుడు(journalist) కామ్లే అశోక్ ఫోన్‌ను గుర్తించి తన వద్ద ఉంచుకున్నారు. కొద్దిసేపటికి ఆ ఫోన్‌కు వచ్చిన కాల్‌కు స్పందించిన అశోక్ ఫోన్ నాకు దొరికింది మీరు బంధువులెవరైనా పంపితే అప్పగిస్తాను అంటూ స్పందించారు. జన్నారం బస్ డిపో వద్ద కృష్ణవేణి బంధువైన సురేష్‌కు ఫోన్‌ను క్షేమంగా అప్పగించారు.కామ్లే అశోక్ నైతిక విలువలను చాటిన విధానంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో బస్సు డ్రైవర్ టి. దయారావు, కండక్టర్ ఎన్. రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.