calender_icon.png 16 October, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఎసిఎస్ చైర్మన్ అలిబిన్అహ్మద్ కు ఆహ్వానం

16-10-2025 11:24:04 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): జల్-జంగల్-జమీన్ కోసం పోరాడిన అమరజీవి కుంరం సూరు 28వ వర్ధంతి సభ ఆహ్వాన పత్రికను సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్‌కు దంతనపల్లి గ్రామ పెద్దలు  అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆయనతో పాటు బిఆర్ఎస్  సీనియర్ నాయకుడు గంధం శ్రీనివాస్‌ను వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన అలీ బిన్ అహ్మద్ ఉన్నతాధికారులతో మాట్లాడి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు, సహకరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆత్రం లక్ష్మణ్, ఆత్రం షేక్ రావు, మడావి తిరుపతి, కుంరం పాండు తదితరులు పాల్గొన్నారు.