16-10-2025 02:38:25 PM
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ఫోన్ లో మాట్లాడారు. మీడియా ముందకు వెళ్లవద్దని కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ సూచించారు. కూర్చొని మాట్లాదామని కొండా సురేఖకు మీనాక్షి హితువు పలికారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాల్సిందిగా కొండా సురేఖకు అధిష్ఠానం సూచించింది. బుధవారం రాత్రి తెలంగాణ అటవీ మంత్రి కొండా సురేఖ నివాసంలో హై డ్రామా జరిగింది.
జూబ్లీహిల్స్‌లోని గాయత్రి హిల్స్‌లోని రాష్ట్ర దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) నివాసం వద్ద హై డ్రామా జరిగింది. కొన్ని ఫిర్యాదులకు సంబంధించి ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకోవడానికి సాధారణ దుస్తులు ధరించిన పోలీసులు రాత్రి ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. సుమంత్ అక్కడ ఉన్నాడనే సమాచారం ఆధారంగా పోలీసులు మంత్రి నివాసానికి చేరుకున్నారని వర్గాలు తెలిపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆవరణలోకి ప్రవేశించడాన్ని గమనించిన సురేఖ కుమార్తె సుష్మిత కిందకు వచ్చి వారిని ప్రశ్నించింది. అధికారులు తమను తాము పోలీసులమని పరిచయం చేసుకుని, సుమంత్‌ను అదుపులోకి తీసుకోవడానికి వచ్చామని చెప్పారు. అయితే, సుష్మిత వారిని లోపలికి అనుమతించడానికి నిరాకరించింది. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది.