calender_icon.png 16 October, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజీనామా

16-10-2025 02:51:13 PM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతాపార్టీకి భారీ షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు(Vikarabad district BJP president) రాజశేఖర్ రెడ్డి రాజీనామాచేశారు. తన రాజీనామా పత్రాన్ని రాజశేఖర్ రెడ్డి బీజేపీ అధిష్ఠానికి పంపారు. పార్టీలో అంతర్గత కలహాల వల్లే పార్టీకి రాజీనామా చేసినట్లు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి రాజీనామా((Rajasekhar Reddy resigns) జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramchander Rao) ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతల మధ్య వాగ్వాదం భారీ ఉద్రిక్తతకు దారితీసింది. అక్టోబర్ 18న రాష్ట్ర బీసీ బంద్ మద్దతివ్వాలని కోరుతూ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతల మధ్య ఫొటోల విషయంలో గొడవ జరిగింది. ఈ తరుణంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆర్. కృష్ణయ్య, రాంచందర్ రావు వాళ్లను హెచ్చరించించడంతో వివాదం సద్దుమణిగింది.