calender_icon.png 16 October, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అంతరాయంతో పట్టణవాసుల ఇక్కట్లు

16-10-2025 02:10:33 PM

మూడు రోజులు పవర్ కట్ తప్పదు అన్న విద్యుత్ అధికారులు

నష్టపోతున్న విద్యుత్ ఆధార వ్యాపారస్తులు

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ అంతరాయం తో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా విద్యుత్ అధికారులు మరమ్మత్తుల పేరుతో పవర్ కట్ చేయడంతో విద్యుత్ ఆధారిత వ్యాపారులు, పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా పట్టణంలోని బస్టాండ్ పరిసర కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మాటిమాటికి కాలిపోవుతుండటంతో అనేకమంది విద్యుత్ పరికరాలు కాలిపోయి నష్టపోయి బాధపడుతుండగా మరోవైపు మరమ్మత్తులతో రోజుల తరబడి విద్యుత్ కోతలు విధించడం స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల కాలనీలో విద్యుత్ అంతరాయం ఉంటుందని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరినప్పటికీ ముందర దీపావళి పండుగ ఉన్నందున వ్యాపారాలు దెబ్బతింటాయని వాపోతున్నారు.బస్సు స్టాండ్ ఎదురుగా ప్రధాన వ్యాపార కూడలి లో మూడు రోజులు మరమ్మతు పనులు చేపట్టడంతో ప్రజలు వ్యాపారులు చేసేది లేక నీరసిల్లి పోతున్నారు. పనులు రాత్రి పగలు త్వరితగతిన పూర్తిచేసి విద్యుత్ పునరుద్ధరించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.