calender_icon.png 16 October, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల చోరీపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

16-10-2025 03:08:49 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ(Vote Chori) జరిగిందంటూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్(BRS ) పార్టీ పిటిషన్ వేసింది. హైకోర్టులో బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది శేషాద్రి నాయుడు(Advocate Seshadri Naidu) వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందంటూ శేషాద్రి నాయుడు కోర్టుకు సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని శేషాద్రి నాయుడు తెలిపారు. జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందంటూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(BRS candidate Maganti Sunitha), కేటీఆర్ పిటిషన్ వేశారు. జూబ్లీహిల్స్ తో సంబంధం లేనివారికి ఓట్లు ఉన్నాయని న్యాయవాది తెలిపారు. ఈ ఓట్ చోరీ పిటిషన్ పై ప్రత్యేక ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది.