calender_icon.png 16 October, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' సభకు హాజరైన ప్రధాని మోదీ

16-10-2025 03:27:02 PM

అమరావతి: కర్నూలు శివారు నన్నూరులో నిర్వహిస్తున్న 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్'(Super GST Super Savings Sabha) సభలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పాల్గొన్నారు. ఈ సభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, గవర్నర్, అబ్దుల్ నజీర్, మంత్రులు, నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీని చంద్రబాబు శాలువాతో సత్కరించి, శివుడి జ్ఞాపికను బహూకరించారు. సభలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(BJP state president Madhav) ప్రధానిని శాలువాతో సత్కరించి అంజనేయస్వామి జ్ఞాపిక బహూకరించారు. ''శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.'' అంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.