20-08-2024 12:30:00 AM
దేశంలో హత్యలు, హత్యాచారాలు, లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. వయసు బేధాలు మరిచి, మానవ మృ గాలవలె కొందరు దాడులు చేస్తున్నారు. నెలల వయసు నుండి వృద్ధుల వరకు అనేకమంది ఈ లైంగిక దాడులకు గురవుతుండడం బాధాకరం. సభ్యసమాజానికే మచ్చ తెచ్చే ఇలాంటి ఉన్మా దులను క్షమించకూడదు. సాధ్యమైనంత త్వరగా వారికి శిక్షలు పడేలా చూడాలి.
మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలవల్ల ఈ హత్యాచారాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక, వాటిని కూడా పూర్తిగా నిషేధించాలి. తాజాగా కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచారం నివ్వెర పరిచింది. ప్రాణాలు కాపాడే వైద్యులవల్లే ప్రజల మానప్రాణాలకు దిక్కు లేకపోవడం దురదృష్టకరం. నిందితులను వేగంగా పట్టుకోవడానికి ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేపట్టాలి. నేరస్తులకు ఉరిశిక్షలే సరైనవి.
-శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్