calender_icon.png 13 May, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల మనసెరిగిన నాయకుడు

20-08-2024 12:30:00 AM

ఇరవైవ శతాబ్దపు చివరిలో భారతదేశం ఎందరో మహానుభావుల ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. వారిలో రాజీవ్‌గాంధీ అత్యంత ప్రముఖుడిగా నిలిచారు. 42 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అయన సమకాలీన భారత రాజకీయాలతోపాటు ప్రపంచ రాజకీయాలపై లోతైన ముద్ర వేశారు. ప్రధానమంత్రిగా భారతదేశానికి కొత్త రూపాన్ని ఇచ్చారు. రాజకీయ వర్గాల్లో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన వ్యక్తిగా ఘనకీర్తిని పొందారు.

రాజీవ్‌గాంధీ 1944 ఆగస్టు 20న బొంబాయిలో జన్మించారు. తీన్‌మూర్తి హౌస్‌లో తాత జవహర్‌లాల్ నెహ్రూతో తన బాల్యంలో ఎక్కువ భాగం గడిపారు. డూన్ స్కూల్ నుండి తన విద్యను పూర్తి చేసిన తర్వాత రాజీవ్ ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ (లండన్)లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో కోర్సు అభ్యసించడానికి వెళ్లారు. ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో సోనియాను కలిశారు. ఆ పరిచయం వారిద్దరి వివాహానికి దారి తీసింది. భారతదేశానికి తిరిగి వచ్చి న తర్వాత వాణిజ్య పైలెట్ లైసెన్స్‌ను పొందారు.

1968లో పైలెట్ వృత్తి   ప్రారంభించి, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు.  సోదరుడు సంజయ్ గాంధీ జీవించి ఉండగా, రాజీవ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ, సంజయ్ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన రెండో కుమారుడైన వీరిని రాజకీయ జీవితంలోకి తీసుకువచ్చారు. 1981లో లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ దారుణ హత్య తర్వాత ఊహించని విధంగా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించారు. 

రాజీవ్‌గాంధీ 21వ శతాబ్దపు భారతదే శం గురించి ప్రత్యేక దృష్టిని కలిగి ఉన్నా రు. ఇది అందరికీ కనీస అవసరాలైన ఆహారం, దుస్తులు, గృహాలను నెరవేర్చే లా చేస్తుంది. అక్కడ ప్రజలు శాంతిని అనుభవిస్తారు. ఆకలి, అవినీతికి దూరం గా ఉంటారు. భారతదేశం గురించి ఆయ న ఆలోచనలలో ధనిక, పేద అనే తారతమ్యానికి తావు లేదు. స్వావలంబన, గర్వించదగిన భారతదేశం గురించి కలలు కన్నారు. రాజీవ్‌గాంధీ మన దేశం, పౌరు ల సుఖసంతోషాల కోసం తన సామర్థ్యం మేరకు ఏదైనా చేయాలనే అంతర్గత ఉత్సాహాన్ని కలిగి ఉండేవారు.

ఇది 21వ శ తాబ్దపు భారతదేశాన్ని దృశ్యమానం చే యడానికి దారి తీసింది. నిజానికి, భవిష్య త్ భారతదేశానికి దిశానిర్దేశం చేసే లక్ష్యం తో పనిచేసే రాజీవ్‌గాంధీ లాంటి నాయకుడిని పొందడం మన జాతి అదృష్టం. కానీ, విచారకరంగా రాజీవ్ పవిత్రమైన కోరిక ఆయన క్రూర హత్యతో భంగమైంది. వారి ఆకస్మిక మరణం దేశాన్ని రాజకీయ శూన్యంలోకి నడిపించింది. 

21వ శతాబ్దపు భారతదేశం పట్ల మ హోన్నతమైన దృక్పథం కలిగిన నాయకత్వాన్ని భారతదేశం ఆయన రూపంలో కోల్పోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో బాగా చదువుకున్న వారే సాయపడగలరని రాజీవ్ ఆశించారు. ‘చదువుకున్నప్పు డే అది సాధ్యమవుతుంది. నాణ్యమైన విద్య ద్వారానే పౌరుడి లక్షణాన్ని పెం పొందించుకోవచ్చు. ఇది వారి హక్కులు, విధులపై వారికి అవగాహన కల్పిస్తుంది. సామాజిక న్యాయం అనేది సమాజంలో ని అన్ని తరగతులు, వర్గాల సమ్మిళిత అభివృద్ధి’ అని రాజీవ్  గ్రహించారు.

కులం, పుట్టుక, మతం, రంగు లాంటి వా టికి అతీతంగా ప్రతి వ్యక్తి అభివృద్ధి చెం దాలని ఆయన ఆకాంక్షించారు. ‘మా ప్రా ధాన్యతలు పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, స్వావలంబన స్థాపన’ అని ఆయన పదే పదే చెప్పారు. ఈ విభాగాల కోసం మాత్రమే మేము మా ప్రణా ళికను సిద్ధం చేశాం. దీనికి దేశసేవ, త్యా గం అవసరం అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.

తాను  కోరుకున్న విధంగా సమాజంలోని కొన్ని వర్గాలకు విద్య చేరడం లేదని అంగీకరించడం ద్వారా తన ఆందోళనను రాజీవ్ పలు మార్లు వ్యక్తపరిచారు. ఉత్త మ పౌర సమాజ స్థాపనకు మూలస్తంభాలైన విద్య, ఉపాధి, వైద్యం, పర్యావరణం, శాస్త్ర సాంకేతికత, సంక్షేమం పట్ల తనదైన ముద్ర వేశారు. రాజీవ్ గాంధీ దృక్పథం లో ఆధునికుడైనప్పటికీ భారతదేశ సంస్కృతి నాగరికతపట్ల మక్కువతో ఉండేవారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యూని కేషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, రోదసీ, పరిశోధన వంటి రంగాలలో భారతదేశం ఒక ప్రధాన దేశంగా నిలవడానికి ఆయన నేతృత్వంలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. కానీ, విధి ఆయనను దేశానికి తొందరలోనే దూరం చేయడం బాధాకరం.

 -డా. ఎం. సురేష్ బాబు