03-05-2025 01:10:41 AM
గోడ ప్రతుల ఆవిష్కరణ
కొత్తపల్లి, మే 2 (విజయ క్రాంతి): కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈనెల11న శ్రీసీతరామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో నిర్వహించనునా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమ గోడప్రతులను శుక్రవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో చాలీసా పారాయణ బృంద సభ్యులు పెరుమాండ్ల కమల్ గౌడ్, బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ సర్పంచులు జింక సంపత్, నాయిని ప్రసాద్, శేఖర్ రావు, గురు స్వాములు రమణాచార్యులు, తిరుపతిగౌడ్, కమల్ గౌడ్, హనుమాన్ మాలాదారుల బృందం పాల్గొన్నారు.