calender_icon.png 8 May, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో ఎస్‌టీఎఫ్ అధికారుల దాడులు

03-05-2025 01:11:42 AM

భారీగా గంజాయి పట్టివేత 

ఖైరతాబాద్, మే 2 (విజయక్రాంతి) : నగరంలో శుక్రవారం పలుచోట్ల  స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్ టి ఎఫ్) అధికారులు టీం హెడ్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఓల్డ్ సిటీలోని పురాణా పూల్, జియాగూడ ప్రాంతాలలో స్కూటీపై ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఎస్ టి ఎఫ్ అధికారులు ఆ వ్యక్తి  వద్ద నుంచి 2.078 కిలోల గంజాయి తో పాటు స్కూటీని స్వాధీనం చేసుకుని  సంజయ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు టీం హెడ్ అంజిరెడ్డి తెలిపారు. సంజయ్ సింగ్ కు సహకరిస్తున్న ఠాకూర్ అశిష్ సింగ్, లక్ష్మణ్ సింగ్, నిరజ్రాయ్ అనే ముగ్గురు వ్యక్తులపై  కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరో కేసులో..

మూసాపేట్ జేపీ భరత్ నగర్ ప్రాంతాలలో ఎస్ టి ఎఫ్ (డి టీం) నిర్వహించిన తనిఖీలలో  ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన కొంపల్లి యశ్వంత్ సాయి షణ్ముఖ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకోవడం జరిగిందని టీం ఎస్త్స్ర జ్యోతి తెలిపారు.

అతని వద్ద నుంచి 1.20 కేజీల గంజాయితోపాటు ఒక బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించడం జరిగిందని తెలిపారు. నిందితుడు గతంలో ఒక ప్రైవేటు సంస్థలో వ్యాపారం నిర్వహించే వాడని ప్రస్తుతం వ్యాపారం బంద్ చేసి బంధువుల ఇండ్లలో ఉంటూ అరకు నుంచి గంజాయిని తీసుకువచ్చి నగరంలో విక్రయాలు చేస్తున్నాడని తెలిపారు.