16 April, 2026 | 8:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

హనుమాన్ జయంతి వేడుకలు

12-04-2025 06:14 PM

పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

పటాన్ చెరు: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల్లోని హనుమాన్ దేవాలయాల్లో శనివారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విజయోత్సవ ర్యాలీలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు.

భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, రుద్రారం మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకన్న, హనుమాన్ భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలు, తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్సిపాలిటీల పరిధిలో హనుమాన్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు.