calender_icon.png 17 October, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్ డే

17-10-2025 12:31:40 AM

నిర్మాత జీ సురేశ్‌కుమార్, నటి మేనకల దంపతులకు 1992, అక్టోబర్ 17న పుట్టిన ఈ గారాల పట్టీ శుక్రవారం 34వ ఏట అడుగిడుతోంది అందాల తార కీర్తి సురేశ్. మలయాళ చిత్రం ‘గీతాంజలి (2013)తో హీరోయిన్‌గా పరిచయమైన కీర్తి.. ‘నేను శైలజ’ (2015)తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సహజ నటి సావిత్రి బయోపిక్‌లో పోషించిన టైటిల్ రోల్.. కీర్తి సురేశ్ నట జీవి తంలోనూ కీర్తి కిరీటమై వెలుగొందే పాత్రే! అభినవ సావిత్రిగా దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం అన్ని భాషల చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్‌గా హవా కొనసాగిస్తోంది. 

ప్రణీత సుభాష్.. తెలుగు, తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు బ్యూటీ. 1992, అక్టోబర్ 17న పుట్టిన ప్రణీత శుక్రవారంతో 34వ పడిలోకి అడుగుపెడుతోంది. తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన పోకిరి (2010) సినిమా కన్నడలో ‘పోర్కి’గా రీమేక్ కాగా, ప్రణీత ఇందులో హీరోయిన్‌గా పరిచయమైంది. తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’తో తెరంగేట్రం చేసింది. 2013లో ‘అత్తారింటికి దారేది’తో  పవన్‌కల్యాణ్ సరసన నటించడం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.