calender_icon.png 12 August, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తిన అధికారులు

12-08-2025 12:29:54 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 11:  నగర శివారు గండిపేట్ మండల పరిధిలోని హిమాయత్ సాగర్ మరో రెండు గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు వదిలిపెట్టారు. ఆదివారం ఓ గేటు ద్వారా మాత్రమే నీళ్లను వదిలగా ఆదివారం సాయంత్రం, రాత్రి ఎగువ ప్రాంతాలైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వర్షం కురవడంతో భారీగా వరద నీరు హిమాయత్ సాగర్ లో వచ్చి చేరుతుంది.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదివారం 8 వ నెంబర్ గేటు ద్వారా నీళ్లు వదిలారు. తాజాగా మరో రెండు గేట్లను ఎత్తి మొత్తం మూడు గేట్ల ద్వారా నీరు దిగువకు వదులుతున్నారు. 8, 10, 12 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని కిందికి వదలడంతో హిమాయత్ సాగర్ ఔటర్ సర్వీస్ రోడ్డును మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1700 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హిమాయత్ సాగర్ మూడు గేట్లను ఎత్తడంతో మూసీనది నిండుగా పారుతుంది.