14-08-2025 01:51:43 AM
100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
మహబూబాబాద్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో బుధవారం 100 అడుగుల జాతీయ పతాకం’తో భారీ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు నిర్వహించారు.
భారతీయ మువ్వన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందని, జాతీయ జెండా స్ఫూర్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని వక్తలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, జిల్లా కోశాధికారి వోలం శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పొదిల నరసింహరెడ్డి, జిల్లాకార్యదర్శి రామడుగు వెంకటాచారి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు బోగోజు నాగేశ్వర చారి, బోనగిరి ఉపేందర్, గాంధీ వెంకట్ రెడ్డి లెంకలపల్లి శ్రీనివాస్, బచ్చు లక్ష్మీనారాయణ, మహమ్మద్ ఖాసిం, మల్యాల రాములు, ఎలబొయిన,
కర్ణాకర్, చేలగోల వెంకటేష్ , జాతోత్ రమేష్, సింగంశెట్టి మధుకర్, బానోత్ సంపత్ ,వెంకన్న, కంచు సురేందర్, జుజ్జూరు వీరభద్ర చారి, జాటోత్ గణేష్, ఇండ్ల వెంకన్న, తడిశెట్టి కరుణాకర్, గుంజ శ్రీనివాస్ రావు, బెజ్జం సురేష్, పల్స రవీందర్ గౌడ్, బొల్లోజు వీరన్న చారి, కొడకండ్ల సంపత్ రెడ్డి, ఉపేందర్, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.